Tuesday, December 24, 2024

కెన్యాలో డ్యాం కూలి 40 మంది మృతి

- Advertisement -
- Advertisement -

నైరోబి: ఆఫ్రికా దేశం కెన్యాలో ఓ డ్యామ్ కూలిపోయి 40 మంది వరకు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. కెన్యాలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రిఫ్ట్ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌లో నీటి ఉద్ధృతి పెరిగి గోడలు కొట్టుకు పోయాయి. ఫలితంగా ఆకస్మిక వరదలు సంభవించి దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించింది. అనేక ఇళ్లు, ప్రధాన రహదారి ధ్వంసమైంది. వరదల్లో పలువురు గల్లంతయ్యారు. డ్యామ్ ధ్వంసం కావడం వల్ల 40 మంది వరకు మృతి చెందారు. ఇది ఒక అంచనా మాత్రమే. ఇంకా పలువురు బురదలో చిక్కుకుని ఉన్నారు.

వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి” అని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. భారీ వర్షాలకు ఇప్పటికే ఈ దేశంలో మరణాలు సంభవిస్తుండగా, డ్యామ్ ఘటనతో ఆ సంఖ్య 120 కి చేరింది. ఎల్‌నినో వల్లే సాధారణం కంటే భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే పాఠశాలలకు ఇచ్చిన మధ్యంతర శెలవుల్ని పొడిగించవలసి వచ్చింది. పొరుగు దేశం టాంజానియాలో కూడా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దాంతో వరదలు , కొండచరియల కారణంగా అక్కడ 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News