Sunday, December 22, 2024

కృష్ణమ్మ ఉగ్రరూపం ..గోదావరిలో పోటెత్తిన వరద

- Advertisement -
- Advertisement -

గత రెండు రోజులుగా కుండపోత వర్షాలతో వాగులు వంకలు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలంకు భారీగా వదరనీరు చేరుతోంది. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఇటు గోదావరిలోనూ వరద ప్రవాహం పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీ వరదతో ఈ సీజన్‌లో తొలిసారి శ్రీరాంసాగర్‌ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండిపోయింది. భారీ వర్షాలతో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు అన్నీ నిండిపోయాయి. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువ నుంచి 2.51లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టు నుంచి 40 గేట్లు ఎత్తివేశారు. దిగువకు 2.68లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తునారు. లక్షన్నర క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1091 అడుగుల వద్ద 72.88టిఎంసీల నీటిని నిలువ చేశారు.భారీ వర్షాల కారణంగా గోదావరి తీరం వైపు, ప్రాజెక్టు వైపు ప్రజలు ఎవరు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగింది. 49763క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టు గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టలోకి 2.92లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెకటు గేట్లు తెరిచి 2.64లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ వద్ద లక్ష్మిబ్యారేజికి 6.74లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. వచ్చిననీటిని వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. సమక్క సాగర్ వద్ద 4.21లక్షల క్యూసెక్కుల నీరు గో దావరిలో ప్రవహిస్తోంది. భైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కుబీర్‌లో విటలేశ్వరుని ఆలయంలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. సింగూరు ప్రాజెక్టులోకి 23942క్యూసెక్కుల నీరు చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 48800క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటినిలువ 9.16టిఎంసీలకు చేరింది.

కృష్ణాతోపాటు వాటి ఉపనదులు వరదనీటిలో ఉరకలు వేస్తున్నాయి. ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని రెండో ప్రమాద హెచ్చరికన జారీ చేశారు.జూరాలకు 3.20లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు .శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.89లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది.పది గేట్లు ఎత్తి 5.52లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద చేరుతుండటంతో 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

సాగర్‌కు ఎగువ నుంచి 5.40లక్షల క్యూసెక్కుల నీరు చేరుతండగా, అంతేనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ప్రకాశం బ్యారేజికి మధ్యన స్తానిక ఉపనదులు వాగుల వంకల ద్వారా కృష్ణాలోకి మరో ఆరు లక్షల క్యూసెక్కుల నీరు చేరుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల 40 వేల క్యూసెక్కులకు మించి వరద వస్తుండగా మొత్తం 70 గేట్లు ఎత్తి అంతే మొత్తం నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రమాదకరంగా ఉరకలు వేస్తుండగా బ్యారేజీ పైనుంచి రాకపోకలను నిలిపేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News