Thursday, January 23, 2025

అఫ్జల్ గంజ్ లో అగ్నిప్రమాదం: 40 గుడిసెలు దగ్ధం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బేగంబజార్ ప్రాంతం అఫ్జల్‌గంజ్‌లోని మూసీ నది పక్కన ఉన్న పూరి గుడిసెలకు మంటలు అంటుకున్నాయి. మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో 40 గుడిసెలు దగ్ధమయ్యాయి. గుడిసెలలో ఉన్న రెండు సిలిండర్లు భారీ ఎత్తున్న పేలడంతో మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. సిలిండర్లు పేలినప్పుడు స్థానికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరు ఇంజన్లతో మంటలను పూర్తిగా ఆర్పేశారు. ఈ ఘటనపై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు పమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బియ్యం, పప్పులు, ఉప్పులు, నగదు మొత్తం అగ్ని ప్రమాదంలో కాలిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టుబట్టలతో బయట ఉన్నామని ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News