Monday, December 23, 2024

కాలివంతెన కూలి 40మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

ఉదంపూర్: జమ్ముకాశ్మీర్ లోని ఉదమ్‌పూర్ జిల్లాలో శుక్రవారం కాలివంతెన కూలి 40మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో చాలామంది చిన్నారులు ఉన్నారని అధికారులు తెలిపారు. బెయిన్ గ్రామంలో బైసాఖి ఉత్సవాలు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. బేణి సంగమం ప్రాంతంలో ఉత్సవాలు సందర్భంగా అధికసంఖ్యలో ప్రజలు బ్రిడ్జిపైకి చేరుకోవడంతో కూలిపోయిందని స్థానిక అధికారులు వెల్లడించారు.

అధికబరువు కారణంగా బ్రిడ్జి కూలిపోయిందని జమ్ము డివిజనల్ కమిషనర్ రమేశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. ఈ ప్రమాదం ఎవరు మరణించలేదని, ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు, రెసూసిబ్బంది బాధితులను రక్షించారు. ప్రమాదంలో గాయపడినవారిని చెనాని ఆసుపత్రిలో చేర్చామని, బాధితుల్లో నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News