Thursday, January 16, 2025

ఛడ్‌లో సైనిక స్థావరంపై దాడి..40 మంది సైనికుల మృతి

- Advertisement -
- Advertisement -

నైజీరియా సరిహద్దు సమీపంలోని తమ సైనిక స్థావరంపై ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు మరనించినట్లు ఛడ్ అధ్యక్ష కార్యాలయం తెలిపింది. సోమవారం ఉదయం సైనిక స్థావరాన్ని సందర్శించిన అధ్యక్షుడు మహమత్ డేబీ ఇట్నో దుండగుల కోసం సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు ప్రకటించారు. ఛడ్ దేశానికి పశ్చిమ దిశలో నైజీరియా సరిహద్దు సమీపంలో అనేక సంవత్సరాలుగా తిరుగుబాటు సమస్య కొనసాగుతోంది. ఈ ఏడాది జూన్‌లో దేశ రాజధాని జమేనాలో ఒక సైనిక ఆయుధాగారంలో పేలుళ్లు సంభవించి 9 మంది మరణించగా 40 మందికిపైగా గాయపడ్డారు.

ఈ ఏడాది మార్చిలో జిహాదీ గ్రూపు బోకో హరాం దాడిలో ఏడుగురు సైనికులు మరణించారని ప్రభుత్వం పేర్కొంది. 2020లో తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను ఛడ్ సైన్యం అంతం చేయడంతో ఆ ప్రాంతంలో స్కూళ్లు, మసీదులు, చర్చీలు మళ్లీ తెరుచుకున్నాయి. అయితే జిహాదీ గ్రూపులు పునరుజ్జీవం పోసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దం క్రితం తిరుగుబాటు కార్యకలాపాలు ప్రారంభించిన బోకో హరాం సంస్థ పాశ్చాత్య విద్యను వ్యతిరేకిస్తూ ఇస్లామిక్ చట్టాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బోకో హరాం తిరుగుబాటు కార్యకలాపాలు కామెరూన్, నిగర్, ఛడ్ వంటి దేశాలకు వ్యాపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News