Friday, December 20, 2024

ట్రూప్ బజార్‌లో పట్టుబడ్డ 40 లక్షల హవాలా సొమ్ము

- Advertisement -
- Advertisement -

గన్‌ఫౌండ్రీ: పెట్రోలింగ్ చేస్తున్న సుల్తాన్ బజార్ పోలీసులకు అజ్ఞాత వ్యక్తి అందించిన సమాచారంతో ట్రూప్ బజార్‌లో డబ్బు సంచులతో అనమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి నుంచి రూ.40 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సుల్తాన్ బజార్ ఇన్‌స్పెక్టర్ బాల గంగిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…. నందకిషోర్ బంజారాహిల్స్‌లోని సమిత్ అగర్వాల్‌కు చెందిన ఏహెచ్‌ఎస్ ఆర్ట్ స్టూడియో షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ట్రూప్ బజార్‌లోని ఓ వ్యక్తి నుంచి డబ్బు తీసుకురావాలని యజమాని నందకిషోర్‌ను పంపించాడు.

పేరు తెలియని వ్యక్తి నుంచి యజమాని చెప్పిన చిరునామా ప్రకారం డబ్బులు తీసుకొని వస్తున్నాడు. ఇదే సమయంలో గురువారం రాత్రి 8.ంం గంటల ప్రాంతంలో ట్రూప్ బజార్‌లో సుల్తాన్ బజార్ సిఐ బాలగంగిరెడ్డి తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాడు. ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిఐకు హవాల డబ్బుపై అందిన సమాచారంతో తన సిబ్బందితో కలిసి చాకచక్యంగా వలపన్ని నందకిషోర్‌ను పట్టుకున్నారు. హవాలా సొమ్ము రూ.40 లక్షలను స్వాధీనం చేసుకొని నిందుతున్ని నాంపల్లి కోర్టులో హాజరు పరిచామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News