Tuesday, April 1, 2025

హైదరాబాద్ జిల్లాలో 40లక్షల మంది ఓటర్లు

- Advertisement -
- Advertisement -

ముసాయిదా జాబితా విడుదల చేసిన ఎన్నికల అధికారులు

మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ జిల్లాలో ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో మొత్తం 40,30,989 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో పురుష ఓటర్లు 22,09,972 మంది కాగా, మహిళా ఓటర్లు 20,90,727 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ ఓట్లు 290. అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,56,995 మంది, అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2,16,648 మంది ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా చెబుతోంది. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 3,986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈసీ వెల్లడించింది. అక్టోబరు 4న ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నట్లు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News