Monday, January 20, 2025

విద్యుత్ షాక్‌తోనే 40 మంది మృతి..

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్: ఒడిశాలో గత వారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 278 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే వీరిలో కనీసం 40మంది విద్యుత్ షాక్‌తోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. రెస్కూ ఆపరేషన్ నిర్వహించిన పోలీసు అధికారి ఒకరు ఈ మేరకు వెల్లడించారు. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్కూ సిబ్బంది పట్టాలు తప్పిన బోగీలనుంచి మృతదేహాలను

వెలికి తీశారని, అయితే ఇందులో కనీసం 40 మృతదేహాలపై ఎలాంటి గాయాల ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్ పి కుమార్ నాయక్ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు( జిఆర్‌పి) కూడా తమ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్‌హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగిందని రైల్వే పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News