- Advertisement -
దక్షిణ మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టబాస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున బస్సును ఓ ట్రక్కు ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 41 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంలో 39 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అధికారులు.. సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.
- Advertisement -