మన తెలంగాణ/హైదరాబాద్ : సైబరాబాద్ పోలీసులతో కలిసి ఎక్సైజ్ పోలీసులు ఆదివారం తెల్లవారు జామున జాయింట్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌పై రైడ్ చేశామని వివరించారు. ఈ పార్టీలో 40 మంది పాల్గొన్నారని వెల్లడించారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారన్నారు. 12 ఇంపోర్టెడ్ బాటిళ్లు, న్యూఢిల్లీ నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్(ఎన్‌డిపిఎల్) మద్యం బాటిళ్లు, మహారాష్ట్ర నుంచి ఎన్‌డిపిఎల్ మద్యం బాటిళ్లు 11కెఎఫ్ అల్ట్రా బీర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఈ పార్టీని రాజ్ పాకాల నిర్వహించారన్నారు. ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పార్టీ నిర్వహించారని వెల్లడించారు. పార్టీలో ఎన్‌డిపిఎల్‌ను సర్వ్ చేశారన్నారు. ఎక్సైజ్ నిబంధనలను ఉల్లంఘించి ఈ రెండు నేరాలకు పాల్పడ్డారన్నారు. ఈ విసయంపై చేవెళ్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని వెల్లడించారు. ఈ రెండు నేరాలపై ఎక్సైజ్ యాక్ట్ 34(a),34(1),,9(1) కింద కేసులను నమోదు చేశామని కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
ఫామ్‌హౌస్ రైడ్‌లో 40 మంది పాల్గొన్నారు : కమలాసన్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -