Friday, December 20, 2024

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

- Advertisement -
- Advertisement -

పెబ్బేరు : తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రే షన్ బియ్యం ఎవరి పాలు అన్న స ందేహంపై పాలు అన్న అనుమానా లు వ్యక్తం అవుతున్నాయి. మంగళవారం తెల్లవారుజామున 44వ జా తీయ రహదారిపై గల కొత్తకోట బై పాస్ వద్ద బొలెరో వాహనంలో వెళ్తు న్న 40 క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై జగదీశ్వర్ రెడ్డి కథనం మేరకు మదనాపురం మండలానికి చెందిన వెంకటేష్ తన కోళ్ల ఫారం కోసం బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. అలంపూర్‌లో బియ్యాన్ని సేకరించి బొలెరో వాహనంలో తరలిస్తుండగా ఆనంద్ భవన్ వద్ద సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ వేణు వాహనాన్ని అడ్డగించి తనిఖీ చేశారు. దీంతో రేషన్ బియ్యం అని నిర్ధారించి వాహనం డ్రైవర్ కురుమూర్తి వెంకటేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ప్రతి రోజూ ఏదో ఒక చోటా .. అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం కొనసాగుతూ రోజూ ఏదో ఒకచోటా కేసులు నమోదు అవుతున్నాయి. రేషన్ బియ్యం దందా దర్జాగా చేస్తూ దొరికితే రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తూ, దొరక్కపోతే నీతులు వల్లిస్తున్నారు. ఉపాధి నిమిత్తం ఏదో ఒక వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తూ లక్షలు గడిస్తున్నారు. అక్రమ దందా వ్యాపారం చేసే దానిపై పీడి యాక్ట్ చట్టం ఉపయోగిస్తేనే అక్రమ దందాకు ముగింపు పలుకుతుందని పలువురు పేర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News