Wednesday, January 22, 2025

బద్రీనాథ్‌లో చిక్కుకున్న 40 మంది తెలుగు యాత్రికులు

- Advertisement -
- Advertisement -

బద్రీనాథ్‌లో 40 మంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. వర్షాల నేపథ్యంలో నిన్న సాయంత్రం గోచార రుద్ర ప్రయాగ దగ్గర విరిగిపడ్డ కొండ చరియలు పడ్డాయి. దీంతో బద్రీనాథ్ రహదారిని మూసేసిన అధికారులు.. రోడ్డుపై పడిన కొండచరియలను తొలగించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

రహదారిని మూసేయడంతో బద్రీనాథ్ లో ఎపిలోని తాడిపత్రికి చెందిన 40మంది తెలుగు యాత్రికులకు చిక్కుకుపోయారు. నిన్నటి నుంచి గోచార రుద్రప్రయాగ వద్ద రోడ్డుపైనే 40మంది యాత్రికులు ఉన్నారు. ఆహారం, మంచినీరు లభించక యాత్రికులు ఇబ్బంది తీవ్ర పడుతున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి ఫోన్ చేసి యాత్రికులు తమ ఆవేదన తెలిపారు. తమకు సహాయం చేయాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News