Friday, December 20, 2024

దేశంలో 40వేల మందిరాలు నిర్మించాల్సిన అవసరం ఉంది: ఎమ్మెల్యే రాజా సింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: భారత దేశంలో ఇంకా 40 వేల మందిరాలు నిర్మించాల్సిన అవసరం ఉందని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో చేతకాని నాయకులు దేశాన్ని పాలించారని, ఇప్పుడు భారత్‌లో భగవ రాజ్యం నడుస్తోందన్నారు. దేశంలో ఇప్పుడు మనల్ని ఎవరూ ఆపలేరన్నారు.

వికారాబాద్‌లో ఆదివారం  నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాబ్రీ మసీదు కోసం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నానా హంగామా చేస్తున్నారని, పార్లమెంట్‌లో బాబ్రీ మసీద్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే అయిపోలేదని భవిష్యత్‌లో ఒవైసీ ఇంకా చాలా చూడాల్సింది చాలా ఉందన్నారు. బిజెపి ప్రభుత్వ అంటే ఏమిటో ముందు ముందు ఇంకా చూపిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్య రామ మందిరం కట్టి చూపించామని, కాశీ, మధురలో కూడా మందిరాలు నిర్మిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News