- Advertisement -
కీవ్: ఉక్రెయిన్ పై బాంబుల మోతతో రష్యా విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలో రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. దీంతో రెండు ఎయిర్ పోర్టులు ధ్వంసం కాగా, 40మంది ఉక్రెయిన్ సైన్యం మృతి చెందారు. 10మంది సామాన్య ప్రజలు మరణించినట్లు ఉక్రెయిన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 10 రష్యా యుద్ధ విమానాలను కూల్చివేశామని తెలిపింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని నాటో దళాలు ఖండించాయి. ఉక్రెయిన్ ప్రజలకు, ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలిపాయి. రష్యా సైనిక చర్యను ఆపాలని నాటో కూటమి పేర్కొంది. లేకపోతే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. రష్యా చర్యలు యూరో-అట్లాంటిక్ భద్రతకు తీవ్ర విఘాతం కలిగింస్తోందని, భాగస్వామ్య దేశాల భద్రతకు అదనపు బలాలను మోహరించనున్నట్లు తెలిపింది.
40 Ukraine Soldiers killed in Russia Attack
- Advertisement -