- Advertisement -
హైదరాబాద్: నగరంలోని హెచ్‌సియు వద్ద 400 ఎకారల భూమి తమదేనని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 400 ఎకారల భూమి వివాదంపై నిరసనలు తలెత్తిన వేళ టిజిఐఐసి కీలక ప్రకటన చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు లేవని స్పష్టం చేసింది. ఆ భూమి యజమాని తామేనని న్యాయస్థానంలో ప్రభుత్వం నిరూపించుకుంది. ఓ ప్రైవేటు సంస్థకు 21 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని న్యాయ పోరాటం ద్వారా దక్కించుకున్నట్లు వెల్లడించింది. వేలం, అభివృద్ధి పనులు అక్కడి రాళ్లను దెబ్బ తీయవని తెలిపింది. అభివృద్ధికి ఇచ్చిన భూమిలో చెరువు లేదని సర్వేలో ఒక్క అంగుళం భూమి కూడా హెచ్‌సియుది కాదని పేర్కొంది. కొందరు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పుకొచ్చింది.
- Advertisement -