Wednesday, January 22, 2025

లోక్ సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు: పీయూష్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: 2047 నాటికి వికసిత్ భారతే మోడీ సర్కార్ లక్ష్యమని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. మోడీ పాలనలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అని చెప్పారు. చేవెళ్ల ఎంపి అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ ఎంపి అభ్యర్థిగా బీబీ పాటిల్ నామినేషన్లు దాఖలు చేశారు. చేవెళ్ల స్థానం నుంచి బిజెపి తరఫున విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగారు. కొండా విశ్వశ్వర్ రెడ్డి, బిబి పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడారు. మోడీ హవాతోనే తెలంగాణలో క్లీన్‌స్వీప్ చేస్తామని, లోక్ సభ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి 400 సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. పదేళ్లలో నాలుగు కోట్ల ఇళ్లకు తాగు నీరు అందించామని, మోడీ పేద ప్రజలకు రక్షణగా ఉంటారన్నారు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ ఏమీ చేయలేదని, కాంగ్రెస్ అంటేను అవినీతి… కుటుంబ పాలన అని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News