Wednesday, January 22, 2025

రామనామ జపంతో 400 మంది విద్యార్థుల ర్యాలీ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నం అంటూ కరీంనగర్‌లోని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా రామానామ జపంతో400 మంది విద్యార్థులు అవగాహన ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని విద్యాసంస్థల అధినేత డా.వి.నరేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం హిందువుల చిరకాల స్వప్నం అని, ధర్మ రక్షణకు ఒక గొప్ప వేదిక అని అన్నారు. రాముడు ధర్మానికి మారు పేరని, సోదరభావానికి పర్యాయపదం అని గుర్తు చేశారు. రాముడు ధర్మానికి కట్టుబడి ఉండడమే కాకుండా ఆచరించి ఆచరింపజేశారని కొనియాడారు. రాముడు దశావతారాలలో ఒకటని, నీతి, న్యాయానికి కట్టుబడి ఉండడమే కాకుండా తండ్రి మాటకు మర్యాద చేసి

14 ఏళ్లపాటు అరణ్యవాసాన్ని అనుభవించి పటాభిషిక్తుడు అయ్యాడని చెప్పారు. అయోధ్యరామ మందిరం ప్రారంభోత్సవ విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేయాలని నగరంలో సుమారు 400 మంది విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించి వ్యాపింపజేశామని పేర్కొన్నారు. ర్యాలీలో భాగంగా విద్యార్థులు చేసిన జై శ్రీరాం.. జై శ్రీరాం, శ్రీరామ జయరామ జయ జయరామ నినాదాలు చాలా ఆకట్టుకోవడంతోపాటు భక్తి భావాన్ని పెంపొందించాయి. ఊరేగింపు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది విద్యార్థులు రామ, లక్ష్మణ, సీత, హనుమాన్ వేషధారణలో విచ్చేసి ఆధ్యాత్మిక వాతవరణాన్ని రెటింపు చేశారు. విద్యార్థులు చేసిన లవకుశ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News