Monday, December 23, 2024

రాబోయే మూడేళ్లలో 400 వందేభారత్ రైళ్లు

- Advertisement -
- Advertisement -

400 Vande Bharat trains in next three years

ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2వేల కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్ విస్తరణ
2022 23నాటికి 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం
నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు
పిఎం గతిశక్తి పథకంలో భాగంగా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన

న్యూఢిల్లీ: దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా తీసుకు వస్తున్న మాస్టర్ ప్లాన్‌లో భాగంగా రైల్వేలు, రేవులు, విమానాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన బడ్జెట్‌ప్రసంగంలో ప్రకటించారు. ప్రస్తుతం అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుపుకొంటున్నామని, రాబోయే 25 ఏళ్ల అమృత్ కాలంలో సాధించాల్సిన లక్షాల్లో భాగంగా గతిశక్తి కింద చేపట్టబోయే మౌలిక సదుపాయాల గురించి ఆమె ప్రస్తావించారు. అత్యాధునిక సదుపాయాలు, గంటకు160 కిలోమీటర్లకంటే వేగంతో ప్రయాణించే వందేభారత్ రైళ్లను మరిన్ని తేవాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే వంద రైళ్లను పట్టాలెక్కించడానికి రైల్వే శాఖ సన్నద్ధం కాగా.. రాబోయే మూడేళ్లలో మరో 400 వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

దీనితో పాటుగా ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా 2000 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్‌ను విస్తరించనున్నారు. 2022 23లో నాలుగు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్ధతిలో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పోస్టల్, రైల్వే నెట్‌వర్క్‌ను అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం ఇప్పటికే వేగంగా జరుగుతోంది. 2021 22 ఆర్థిక సంవత్సరంలో 13,327 కిలోమీటర్ల మేరకు రహదారుల నిర్మాణం జరిగినట్లు ఆర్థిక సర్వే పేర్కొనగా, 2022 23 నాటికి 25 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరగాలని నిర్ణయించినట్లు ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. దీనికి రూ.20,000 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. అలాగే రాబోయే మూడేళ్లలో పిఎం గతిశక్తిపథకం కింద వంద కార్గోటెర్మినళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News