Sunday, December 22, 2024

2018 నుంచి 403 మంది భారతీయ విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివిధ కారణాలతో విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థులు 2018 నుంచి మొత్తం 403 మంది మరణించారని ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు తెలిపింది. వీటిలో సహజ మరణాలతోపాటు ప్రమాదాలు, వైద్యపరమైన పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలలో అత్యధికంగా కెనడాలో 91, బ్రిటన్‌లో 48 జరిగినట్లు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

విదేశాలలో ఉన్న భారీయ విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యతలలో అతి ముఖ్యమైనదని విదేశాలలో భారతీయ విద్యార్థుల భద్రతపై ఒక ప్రశ్నకు జవాబిస్తూ ఆయన తెలిపారు. విదేశాలలోని భారతీయ విద్యార్థులకు ఎటువంటి సమస్య ఎదురైనా అక్కడి భారతీయ మిషన్లు ప్రాధాన్యతా క్రమంలో స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. 2018 నుంచి 403 మంది భారతీయ విద్యార్థులు మరనించగా వీరిలో కెనడాలో 91 మంది, బ్రిటన్‌లో 48 మంది, రష్యాలో 40 మంది, అమెరికాలో 36 మంది, ఆస్ట్రేలియాలో 35 మంది, ఉక్రెయిన్‌లో 21 మంది, జర్మనీలో 20 మంది, సైప్రస్‌లో 14 మంది, ఫిలిప్పీన్స్, ఇటలీలో 10 మంది చొప్పున, ఖతర్, చైనా, కిర్గిజిస్తాన్‌లో 9 మంది చొప్పున ఉన్నారని జైశంకర్ తెలిపారు.

పాలసీనా పట్ల భారత్ వైఖరి మొదటి నుంచి ఒకేరకంగా ఉందని, అందులో ఎటువంటి మార్పు లేదని మరో ప్రశ్నకు జవాబిస్తూ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి మురళీధరన్ తెలిపారు. ఇజ్రేల్ పొరుగున శాంతితో గుర్తింపు పొందిన సరిహద్దులతో పాలస్తీనాకు స్వత్రం దేశాన్ని కల్పిస్తూ రెండు దేశాల సూత్రాన్ని ఈ సమస్యకు పరిష్కారంగా భారత్ సూచించినట్లు ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News