Monday, January 20, 2025

4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు రూ. 404.82 కోట్ల మంజూరు…

- Advertisement -
- Advertisement -

404 Crores sanctioned for railway bridges

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే వీటి నిర్మాణానికి అయ్యే ఖర్చు మొత్తం 404.82 కోట్ల రూపాయల్లో 250.02 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించనుండగా 154.80 కోట్లు రైల్వేశాఖ భరిస్తుందని తెలిపారు. చటాన్ పల్లి-షాద్ నగర్, ఆదిలాబాద్ మార్కెట్ యార్డు, పెద్దపల్లి టౌన్, మాధవనగర్-నిజామాబాద్ లలో నాలుగు రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News