Monday, December 23, 2024

‘404 టిఎంసిల’ నీరు వృథా

- Advertisement -
- Advertisement -

ఎస్‌ఆర్‌ఎస్‌పికి ఈ సీజన్‌లో ఇప్పటికే 474టిఎంసీల ఇన్‌ఫ్లో
ఆయకట్టుకు వినియోగం 70టిఎంసీలే తెలంగాణ రాష్ట్రం
ఏర్పడ్డాక ఇదే తొలి రికార్డు మే చివరినాటికి 600టిఎంసీల
అంచనా 1983లో 1169టిఎంసీలతో ఆల్‌టైం రికార్డ్

మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదీ జలాలు ఉప్పుసముద్రంలోకి వృధాగా పోతున్నాయి. ఈ నీటిసంవత్సరంలో జూన్ ప్రారంభం నుంచి ఇ ప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి 404 టిఎ ంసీల గోదావరి జలాలు వృధాగా పోయాయి. ఈ ఏడాది వానాకాలం ఆయకట్టుకు ఉపయోగిం చు కున్న నీరు కేవలం 70టిఎంసీలు మాత్రమే. తెలం గాణ భూభాగం నుంచి వందల టీఎంసీలు వృధా గా జారిపోయాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు చరిత్ర లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మునుపెన్నడూ లే నంతగా ఈ సారి భారీగా వరదనీరు చేరింది. ఎగు వ నుంచి ప్రాజెక్టులోకి 474టీఎంసీల నీరు చేరిం ది. ప్రాజెక్టు నిర్మించాక ఇంత పెద్దమొత్తంలో ఎగు వ నుంచి జలాశయంలోకి నీటి చేరిక మూడు దశా బ్దాల తర్వాత ఇదే రికార్డు అని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో గోదావరి నది కి ముఖద్వారంగా ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిలువ సామర్ధం 90.31 టిఎంసీలు మాత్రమే. 1091అడుగుల గరిష్ట స్థా యి నీటిమట్టానికిగాను ఇప్పటికే ప్రాజెక్టులో నీటి నిలువ పూర్తి స్థాయిలో ఉంది. ఎగువ నుంచి వస్తు న్న నీటిని ఇక ఏమాత్రం నిలువ చేసుకునే వీలులే కపోవటంతో ప్రాజెక్టు గేట్లు తెరిచి వృధాగా నీటిని దిగువకు విడుదల చేయకతప్పటం లేదంటు న్నా రు. 1963లో అప్పటి ప్రభుత్వం నిజామాబాద్ జి ల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 1977నాటికి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే నాటికి ఎగువన మహారాష్ట్రలో జైక్వాడి మొదలు కొని గోదావరి నదిపై పెద్దగా ప్రాజెక్టులు లేవు. దీం తో ప్రతి సీజన్‌లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగు వనుంచి గోదావరి జలాలు సమృద్ధిగా చేరి ఆయ కట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందేది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక 198384లో భారీ వర్షాలకు తొలిసారి శ్రీరాంసాగర్‌లోకి గోదావరినదీజలాలు పెను ఉప్పెనలా ఉరికి వచ్చాయి. ఈ ఏడాది ప్రాజెక్టులోకి రికార్డు స్థాయిలో 1169టిఎంసీల నీరు చేరుకుంది.

ఆ తరువాత నాలుగేళ్లకు 198889లో మళ్లీ ఉప్పేనను తలపిస్తూ వరదనీరు చేరుకుంది. మొత్తం 928టిఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరుకుంది. ఇక ఆ తర్వాత శ్రీరాసాగర్ ప్రాజెక్టులోకి నీటి చేరికలు మందగిస్తూ వచ్చాయి. ఎగువన మహారాష్ట్రలో ప్రాజెక్టులు , బ్యారేజిలు, ఎత్తిపోతల పథకాల నిర్మాణాలతో దిగువకు గోదావరి నీటిగలగలలు మూగబోతూ వచ్చాయి. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరినదిపై అక్రమంగా బాబ్లీ ప్రాజెక్టు నిర్మించటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీటి చేరికలు మరింత ఆలస్యం అవుతూ వస్తున్నాయి. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఈ ప్రాజెక్టుకు గేట్లు బిగించాక తోలిసారి 201617లో ఎగువ నుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 360టిఎంసీల నీరు చేరింది. గత నీటి సంవత్సరం కూడా ప్రాజెక్టులోకి నీటిచేరికలు మందగమనంతో సాగుతూ జూన్ నుంచి మే చివరి నాటికి మొత్తం 128టిఎంసీల నీరు చేరుకుంది.

30ఏళ్ల తర్వాత మళ్లీ కళకళ..

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీటిచేరికలతో 30ఏళ్ల తర్వాత ప్రాజెక్టు మళ్లీ కళకళలాడుతోంది. జూన్ నుంచి ప్రారంభమైన ఈ నీటిసంవత్సరంలో నాలుగునెలల్లోనే 474టిఎంసీల నీరు చేరుకుంది. మే చివరినాటికి ప్రాజెక్టులోకి నీటి చేరికలు 600టిఎంసీలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఇప్పటిలాగే దంచి కొడితే 198889నాటి నీటిచేరికల రికార్డును తిరగరాసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

శ్రీరాంసాగర్‌లోకి కొనసాగుతున్న వరద:

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుంచి గోదావరి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులో గరిష్టస్థాయి 1091అడుగుల నీటిమట్టం వద్ద రిజర్వాయర్‌లో ఇప్పటికే పూర్తి స్థాయిలో 90.31టిఎంసీల నీరు నిలువ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 89.76టిఎంసీల నీరు నిలువ ఉండేది. మంగళవారం నాడు ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 34911క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రిజర్వాయర్ నుంచి 34,916క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. ఇందులో స్పిల్ వే ద్వారా 25840క్యూసెక్కులు , పవర్‌హౌస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 4000క్యూసెక్కులు, ప్రధాన కాలువలకు 4410క్యూసెక్కులు, ఇతర అవసరాలరిత్యా 664క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News