మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకులాల్లో బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 40,756 మంది విద్యార్థులు హాజరయ్యారు. సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయడానికి ఆదివారం బిఎల్‌వి సెట్ 2022 పరీక్షను రాష్ట్రంలోని 136 కేంద్రాల్లో నిర్వహించారు. నమోదు చేసుకున్న అభ్యర్థుల్లో 81 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని సెట్ కన్వీనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. పరీక్షకు విస్తృత ఏర్పాటు చేసి ప్రశాంతంగా నిర్వహించిన సిబ్బందికి ఆయన అభినందించారు. బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీకి నిర్వహించిన పరీక్షకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరు కావడం సాంఘీక, గిరిజన సంక్షేమ రెసిడెన్షిల్ పాఠశాలల్లో ఉన్న డిమాండ్‌ను తెలియజేసోందని అన్నారు. ఈ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు ఆయన ధన్యవాదాలు తెలపారు.