- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ అక్రమంగా తరలిస్తున్న 409 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో నిర్వహించిన తనికీలలో దుబాయి నుంచి ఎమిరేట్స్ విమాన ఇకె524లో శంషాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి నుంచి 409 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.21.66లక్షల వరకు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈక్రమంలో సదరు ప్రయాణీకుడు తన సూట్కేస్ లోపల సపోర్టింగ్ మెటల్ ఫ్రేమ్‌లో 409 గ్రాముల బంగారం దాచి తరలిస్తుండగా తనిఖీలో బయటపడిందని, ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితునిపై కేసు నమోదు చేసినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అదేవిధంగా పట్టుబడిన నిందితుడుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు వివరించారు.
- Advertisement -