17మంది నామినేషన్లు తిరస్కరణ
మన తెలంగాణ/ నిడమనూరు: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగిసింది. సాగర్ ఉపఎన్నికల బరిలో 60 మంది ఉండగా 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా, తుది పోరుకు మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్‌సింగ్ తెలిపారు. ఉప ఎన్నికకు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్‌కు దా ఖలు చేయగా నామపత్రాల పరిశీలనలోనే 17 మంది పత్రాలను అధికారులు తిరస్కరించారు.
తుది పోరులో 41 మంది ఉప ఎన్నికల బరిలో ఉండగా ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి కుందూరు జానారెడ్డి, బీజేపీ నుంచి పానుగోతు రవికుమార్ నాయక్ బరిలో ఉన్నారు. ఉప ఎన్నికల పోలింగ్ సమ యం దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఇంటింటికి వెళ్లి తమ పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోరు ప్రధాన పార్టీల ప్రచార జోరు ఊపందుకున్నాయి. దీంతో ఇరుపార్టీల అభ్యర్థులు ఎవరికి వారుగా గెలుపుపై దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 17న జరిగే ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 2న అభ్యర్థుల ఫలితాలు వెలువడనున్నది.