Thursday, January 23, 2025

పాఠశాలలో 38 మంది విద్యార్థులతో సహా 41 మంది ఊచకోత

- Advertisement -
- Advertisement -

కంపాలా : ఉగాండా , కాంగో సరిహద్దు లోని లుబిరిరా సెకండరీ పాఠశాలపై శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో సాయుధ తిరుగుబాటు దారులు జరిపిన దాడిలో 38 మంది విద్యార్థులతో సహా మొత్తం 41 మంది ఊచకోతకు గురయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక మేయర్ శనివారం ఈ ఘాతుకాన్ని వివరించారు. ఈ దాడి తరువాత 25 మంది వరకు ఉన్న తిరుగుబాటు దారులు దాదాపు ఆరుగుర్ని ఎత్తుకుని సరిహద్దు దాటి కాంగోలోకి పారిపోయారని ఉగాండా మిలిటరీ వెల్లడించింది. బాధితుల్లో విద్యార్థులు, ఒక గార్డు, స్థానిక సమాజ సభ్యులు ఇద్దరు స్కూల్ బయట హత్యకు గురయ్యారని ఎంపాడ్వే లూబ్రిహా మేయర్ సెలెవెస్ట్ మెపోజ్ వెల్లడించారు. దుండగులు డార్మిటరీకి నిప్పు పెట్టడంతో కొంతమంది విద్యార్థులు విపరీతంగా కాలిపోయారని, మిగతా వారు కొడవళ్లతో నరకబడ్డారని చెప్పారు.

డార్మిటరీ లోని ఫుడ్‌స్టోర్‌ను కొల్లగొట్టి ఆహారం దోచుకున్నారు. సమీపాన ఉన్న సైనిక స్థావరానికి చెందిన సైనికులు వెంటనే అక్కడకు వచ్చే సరికే స్కూల్ మంటల్లో తగులబడడం గమనించారని , ఆవరణలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని మిలిటరీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ ఫెలిక్స్ కులయిగ్యే ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడిన ఎనిమిది మందికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దాడి తరువాత దుండగులు కొంత ఆహారాన్ని దోచుకుని కాంగో దేశంలోని విరుంగా జాఈయ పార్కుకు పారిపోయినట్టు గుర్తించామని, వారిని వెంటాడుతున్నామని పోలీస్‌లు చెప్పారు. అలయిడ్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎడిఎఫ్)కు చెందిన వారే ఈ దాడికి పాల్పడినట్టు పోలీస్‌లు చెప్పారు.

అమెరికాకు మిత్రునిగా ఉంటున్న ఉగాండా అధ్యక్షుడు యోవేరీ ముసెవెని 1986 ఉంచి అధికారంలో ఉన్నారు. ఆయన పరిపాలనను ఏడీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 2001 లో ఉగాండా సైన్యం తీవ్రంగా దాడులను అరికట్టే ప్రయత్నం చేయడంతో ఎడిఎఫ్ తూర్పు కాంగో లోకి పారిపోయి అక్కడి నుంచి దాడులు కొనసాగిస్తోంది. ఏడిఎఫ్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News