- Advertisement -
హైదరాబాద్: హెర్బల్ ప్రొడక్ట్స్ సరఫరా చేస్తామని రూ. 41 లక్షల మోసం చేసిన సంఘటన హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో జరిగింది. సైబర్ నేరగాడిని ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇవేరి కోస్టు దేశానికి చెందిన వ్యక్తి హెర్బల్ ప్రొడక్ట్ సరఫరా చేస్తామని మెహిదీపట్నంలో ఉండే శైలజ కుమారీకి ఫోన్ చేశారు. అడ్వాన్స్ కింద ఆన్ లైన్ లో 41 లక్షల రూపాయలు పంపిస్తే ఐదు కోట్ల రూపాయల విలువ గల హెర్బల్ ప్రొడక్ట్స్ పంపిస్తామని చెప్పడంతో ఆమె వెంటనే నగదును పంపించింది. హెర్బల్ ప్రొడక్ట్స్ రాకపోయేసరికి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి ఇవేరి కోస్ట్ దేశానికి చెందిన మెస్సి ఢాంకో ఫ్రాంక్ ను ఢిల్లీ లో అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్ కు తరలించిన సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.
- Advertisement -