- Advertisement -
బమాకో: మాలిలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-లారీ ఢీకొన్న ఘటనలో 41 మంది మృత్యువాతపడగా మరో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సెగో పట్టణానికి 20 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. లోడ్ తో వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి బస్సు పైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగి ఉంటుందిన పోలీసులు భావిస్తున్నారు. రోడ్లు అద్వానంగా ఉండడంతో రోడ్డు ప్రమాదాలు ఆఫ్రికాలో ఎక్కువగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ప్రతి లక్ష మంది 26 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని డబ్ల్యు హెచ్ఒ తెలిపింది.
- Advertisement -