- Advertisement -
జకార్తా: ఇండోనేషియా రాజధాని జకార్తా సమీపంలో ఉన్న ఒక కారాగారంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించి 41 మంది ఖైదీలు మరణించారు. మరో 80 మంది గాయపడ్డారు. మృతులలో మాదకద్రవ్యాల కేసులో శిక్షను అనుభవిస్తున్న ఇద్దరు విదేశీ ఖైదీలు కూడా ఉన్నారు. ఖైదీలతో కిక్కిరిసి ఉన్న టాంగెరాంగ్ జైలులో హఠాత్తుగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శకటాలు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించాయి. మరణించిన 41 మందిలో చాలామంది మాదక ద్రవ్యాల కేసుల శిక్షను అనుభవిస్తున్న ఖైదీలేనని, వీరిలో దక్షిణాఫ్రికా, పోర్చుగల్‌కు చెందిన ఇద్దరు ఖైదీలు ఉన్నారని ఇండోనేషియా న్యాయ, మానవ హక్కుల శాఖ మంత్రి యసోనా లవ్లీ తెలిపారు. ఒక ఉగ్రవాది, ఒక హంతకుడు కూడా మృతులలో ఉన్నట్లు ఆయన చెప్పారు.
41 prisoner died in Indonesia
- Advertisement -