Wednesday, January 22, 2025

తుంగభద్రలోకి 41 వేల క్యూసెక్కుల నీరు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తుంగభద్ర జలాశయం లోకి శనివారం ఉదయానికి 41 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. గత కొద్ది రోజులుగా జలాశయం పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం కారణంగా జలాశయం లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కేవలం 3 టిఎంసిల నీరున్న జలాశయం లోకి ఇప్పుడు 17 టిఎంసిల నీరు సంగ్రహమైంది. రిజర్వాయర్ గరిష్ట మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 1596 అడుగులు. రెండు మూడు రోజుల్లో రిజర్వాయర్ నీటి మట్టం 1600 అడుగులకు చేరే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News