మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మ రోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 42 మంది ఐఏఎస్‌లు స్థానచలనం కలిగిస్తూరాష్ట్ర సిఎస్ శాంతికుమారి సోమవా రం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థికశాఖ ముఖ్య కా ర్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించగా, పశు సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి గా సవ్యసాచి ఘోష్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ ము ఖ్య కార్యదర్శిగా సంజయ్‌కుమార్, యువజ న సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ము ఖ్య కార్యదర్శిగా వాణి ప్రసాద్‌ను ని యమించగా, దేవాదాయ శాఖ, చేనే త, హస్త కళల ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ను ప్రభుత్వం నియమించింది. అహ్మద్ నదీమ్‌కు అటవీ, పర్యావరణ శాఖలతో పాటుగా టిపిటిఆర్‌ఐ డిజిగా అదన పు బాధ్యతలు అప్పగించింది. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి గా రిజ్వీ, జీఏడి ముఖ్య కార్యదర్శి గా సుదర్శన్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
జ్యోతి బుద్ధప్రసాద్‌కు హౌ సింగ్,రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖ ము ఖ్య కార్యదర్శిగా అవకాశం కల్పించిన తెలంగాణ ప్రభుత్వం, స్పోర్ట్ అథారిటీ ఎండిగా సోనీ బాలాదేవి, రవాణా శాఖ కమిషనర్‌గా కె.ఇలంబరితి కొనసాగనున్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా రొనాల్ రోస్‌కు జెన్‌కో, ట్రాన్స్‌కో అదనపు బాధ్యతలను కూడా అప్పగించింది. జీహెచ్‌ఎంసి, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్‌గా రంగనాథ్‌ను నియమించింది. ఇక జీహెచ్‌ఎంసి ఇన్‌చార్జీ కమిషనర్‌గా ఆమ్రపాలి, శ్రీ దేవసేనను కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్, సెర్ప్ సీఈఓగా ఉన్న డి.దివ్యకు ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. దాసరి హరిచందనను రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్.ప్రకాష్‌రెడ్డి పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగా నియమించింది.
ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలుగు వర్షిణి
ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలుగు వర్షిణి, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి వి.పి.గౌతమ్‌కు పురపాలక శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు, ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్‌గా కృష్ణా ఆదిత్యకు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. జలమండలి ఎండిగా కె.అశోక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా అనురాగ్ జయంతి, ఐటి ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రాను, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి.రవి, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరక్టర్‌గా కె.నిఖిల, ఉద్యానవన శాఖ డైరెక్టర్‌గా యాస్మిన్ భాష, ఫ్రొటోకాల్ విభాగం జాయింట్ సెక్రటరీగా ఎస్.వెంకట్రావు, వ్యవసాయ సహకార శాఖ జాయింట్ సెక్రటరీగా పి.ఉదయ్‌కుమార్, పశువైద్య శాఖ డైరెక్టర్‌గా బి.గోపి, మత్స్యశాఖ డైరెక్టర్‌గా ప్రియాంక అల, టూరిజం డైరెక్టర్‌గా తిరుపతి,
ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా కాత్యాయిని దేవి, జిహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్‌గా స్నేహా శభరీష్, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవి నరసింహారెడ్డి, మెడికల్ సర్వీస్, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా బోర్కడే హేమంత్ సహదేర రావు, జీహెచ్‌ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్‌గా హేమంత కేశవ్ పాటిల్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌గా అపూర్వ చౌహాన్, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా పి.ఉపేందర్ రెడ్డి, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా అభిషేక్ అగస్త్య, ఐటిడిఏ పిఓగా బి.రాహుల్, మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పి.గౌతమ్, టిజిఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నిఖిల్ చక్రవర్తిలను నియమించారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 20 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ చేయగా ప్రస్తుతం 44 మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.