Sunday, February 9, 2025

42 శాతం బిసి రిజర్వేషన్లకు సానుకూలం

- Advertisement -
- Advertisement -

బిసి సంఘాలు, మేధావుల సూచనలను
సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం
అవి అమలు అయ్యేలా కృషి చేస్తాం
బిసి సంఘాలు, మేధావులతో మంత్రి
పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు
కె.కేశవరావు సమావేశం బిసి నేతల
అనుమానాలను నివృత్తి చేసిన పొన్నం, కెకె

మన తెలంగాణ / హైదరాబాద్ : స్థానిక సం స్థల ఎన్నికలలో రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, బిసి ఎంపవర్మెంట్, బిసి డిక్లరేషన్ అమలుపై పలు బిసి సంఘాలు, నేతలు ఇచ్చిన సూచనలు , సలహాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా చూస్తామ ని బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు., బిసిలకు సామాజిక న్యాయం జరగడానికి తమ ప్రభుత్వం పార్టీ క ట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేసారు. సమగ్ర కుటుంబ సర్వేపై అనుమానాలు, అభ్యంతరా లు వ్యక్తం చేస్తున్న బిసి సంఘాలతో సచివాలయంలో శనివారం మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులు, ప్రభుత్వ సలహాదారు, బిసి సంఘాల నేతలు ,మేధావు లు ,ప్రొఫెసర్ లతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించారు. కుల గణన సర్వేలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాలు, మేధావులు కోరారు.

అలాగే రి జర్వేషన్‌లకు చట్టబద్దత కల్పించాలని డిమాం డ్ చేసారు. ఈ సమావేశం లో బీసీ సంఘాలు, మేధావులు వెలిబుచ్చిన అనుమానాలను మం త్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు నివృతి చేశారు. గత సంవత్సరం ఫిబ్రవరి 2024 కేబినెట్ నిర్ణయం తీసుకుంద ని అదే నెల 16వ తేదీన శాసనసభలో బిసి కు లగణన పై తీర్మానం చేసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వివరించా రు. అయితే పార్లమెంటు ఎన్నికల వల్ల కొంత ఆలస్యమైనట్టు తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వం బిసి కమిషన్ చైర్మన్, సభ్యులను ని యమించిందని తెలిపారు. బిసి కమిషన్ వద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో ప్లానింగ్ డిపార్టుమెంట్‌కు సమగ్ర సర్వేను అప్పగించినట్లు తెలిపారు. 150 ఇళ్ల ను ఒక గ్రూపింగ్ చేసి పదిమంది ఎన్యూమరేటర్లకు ఒక పరిశీలకుడు లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ సర్వే నిర్వహించారని రాష్ట్రస్థాయిలో సందీప్ కుమార్ సు ల్తానియ ,హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి దీనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. సర్వే కోసం 160 కోట్ల ప్రభుత్వం కేటాయించిందని గ్రామాల్లో సర్వే బాగా జరిగినప్పటికీ, హైదరాబాద్ లాంటి నగరాల్లో కొంత ఇబ్బంది ఏర్పడిందని మంత్రి వివరించారు.

తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల కనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎ న్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన పూర్తి చేసిందని. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశంలో అత్యంత పారదర్శకంగా రాజకీయ, సామాజికంగా విద్యాపరంగా, ఆర్థికంగా ‘మేం ఎంతో మాకు అంత’ నినాదాన్ని నిజం చేయడానికి ఇంటింటి సమగ్ర కుల సర్వే నిర్వహించినట్లు మంత్రి పొన్నం వివరించారు. దీనిని కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి గోరంతను కొండంత చేస్తూ కుల సర్వేను తప్పుపడుతున్న తరుణంలో బిసి సంఘాలు , మేధావులు , ఫ్రొఫెసర్ల తో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వివరించారు. బిసి కుల గణన ద్వారా సామాజిక న్యాయం జరుగుతుందని, సమాజంలో అట్టడుగు వర్గాలకు న్యాయం చేయడానికి ఎవరు ఎలాంటి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీక రిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

తమ ప్రభుత్వం ఓపెన్‌గా సలహాలు సూచనలు స్వీకరిస్తు ందని ఇందులో ఎలాంటి దాపరికాలు లేవన్నారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌లు బిసిలను అణగదొక్కి సామాజిక న్యాయం చేయకుండా కుల గణన చేయలేదని విమర్శి ంచారు. సమావేశంలో పాల్గొన్న బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్ ఎంపి సురేష్ షెట్కర్ ,ఎంఎల్‌ఎ వీర్ల పల్లి శంకర్, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి,మాజి ఎంపి అంజన్ కుమార్ యాదవ్,, బిసి కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్ ,తిరుమల గిరి సురేందర్ ,బాలలక్ష్మి, కార్పొరేషన్ చైర్మన్‌లు నూతి శ్రీకాంత్ గౌడ్ , జ్ఞానేశ్వర్, ఈరవత్రి అనిల్, మెట్టు సాయి కుమార్, జైపాల్ , వినయ్ కుమార్, లతో పాటు బిసి సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య , జాజుల శ్రీనివాస్ గౌడ్ , మాజి బిసి కమిషన్ చైర్మన్ వకులా భరణం కృష్ణమూర్తి , మాజీ ఐఎఎస్ చిరంజీవులు ,మురళి మనోహర్, తాడురీ శ్రీనివాస్ , బాలరాజు గౌడ్, దాసు సురేష్ శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.

42% రిజర్వేషన్లకు చట్టం చేయాలి: కృష్ణయ్య

సమగ్ర కులగణనలో తప్పలు జరిగాయని, బిసి జనాభా తగ్గినట్లు లెక్కలు తేల్చడం సరికాదని జాతీయ బిసి సం క్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య సమా వేశంలో మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు చెప్పారు. వాటి ని సరిచేయాలని, స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్‌లు 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యా ంగ రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్‌ల పెంపు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. జరిగిన పొరపాట్లను సరిది ద్దాలని, అవసరమైన చోట రీ సర్వే చేయాలని కోరారు.

సర్వేలో పాల్గొనని వారికోసం స్పెషల్ డ్రైవ్ పెట్టండి : జాజుల శ్రీనివాస్‌గౌడ్

ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే అసమగ్రంగా ఉం దని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 2011, 2014, 2022 లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4 కోట్లుందని కాగా ఇప్పటి సర్వేలో 3కోట్ల64 లక్షల జనాభా ఉన్నట్లు చెప్పడం కులగణన అసమగ్రంగా ఉందని స్పష్ట మవుతోంద న్నారు. సర్వేలో పాల్గొనని వారి కోసం ఒక రోజు స్పెషల్ డైవ్ పె ట్టాలని, విదేశాల్లో ఉన్న వారి కోసం ఒక ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. సమగ్ర కుల గణన డాటా ఎంట్రీలో తప్పులు జరిగాయని వాటిని సరిదిద్దాల న్నారు. 2014లో అగ్రకులాలు 21 శాతం ఉన్నాయని సిఎం చెప్పడం సరికాదని అప్పుడు 12 శాతం ముస్లిం జనాభాను కూడా అగ్రకులాల్లోనే ఉన్నారన్న విషయం పరిగణలోకి తీసుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News