హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. శాసన సభలో కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. పురపాలక, జిహెచ్‌ఎంసి, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుల్లో ఈ అంశం లేదని, మూడు బిల్లులకు బిఆర్‌ఎస్ తరఫున సవరణలు ప్రతిపాదిస్తున్నామని సూచించారు. బిఆర్‌ఎస్ చేసిన సవరణలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అవసరమైతే శాసన సభ, మండలిలో డివిజన్‌కు కూడా పట్టుబడుతామని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, నవంబర్‌లోగా కులగణన పూర్తి చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, కులగణన తేల్చకుండా చట్ట సవరణకు అసెంబ్లీ ప్రయత్నిస్తున్నామని, 50 శాతంపైగా ఉన్న బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. 42 శాతం రిజర్వేషన్లు ప్రస్తావించకపోవడం బిసిలను మోసం చేయడమేనని కెటిఆర్ మండిపడ్డారు.
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే: కెటిఆర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -