- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో 42,909 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో 380మంది బాధితులు మరణించారని తెలిపింది. ఒక్క కేరళలోనే 29,836 కరోనా పాజిటీవ్ కేసులు బయటపడగా, 75మంది మృతి చెందారని పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం 4,38,210మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 34,763మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 3,19,23,405 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,76,324 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 63.43 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ పేర్కొంది.
42909 New Corona Cases Reported in India
- Advertisement -