Thursday, January 23, 2025

43 స్థానాలలో 1000 లోపే ఓట్ల మెజార్టీ…

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 119 స్థానాలు, బిజెపి 73 స్థానాలు, జెడిఎస్ 26 స్థానాలు, ఇతరలు ఆరు స్థానాలలో ముందంజలో ఉన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో 43 స్థానాలు కీలకం కాబోతున్నాయి. కాంగ్రెస్ -బిజెపిల మధ్య 1000 లోపే ఓట్ల తేడా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫలితాలను విశ్లేషిస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ నేతలతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే టచ్‌లో ఉన్నారు. సిమ్లాలోని హనుమాన్ టెంపుల్లో ప్రియాంక పూజలు చేశారు.

గ్రామీణ ప్రాంత ఓటర్లు హస్తానికి జై కొడుతున్నారు. హైదరాబాద్ కర్నాటకలోనూ కాంగ్రెస్ పూర్తి ఆధిక్యం దిశగా ముందుకెళ్తోంది. కోస్టల్ కర్నాటక, బెంగళూరులో బిజెపి ముందంజలో ఉంది. ముంబయి కర్నాటకలో బిజెపికి కాంగ్రెస్ ఝలక్ ఇచ్చింది. ఇండిపెండెంట్ అభ్యర్థులతో డికె శివ కుమార్ టచ్‌లో ఉన్నారు. బిజెపి రెబల్స్‌తోనూ శివకుమార్ మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే కుమారస్వామితో కాంగ్రెస్ నేతలు మంతనాలు జరిపినట్టు సమాచారం.

Also Read: హంగ్ వస్తే కింగ్ ఎవరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News