Thursday, January 23, 2025

బీహార్‌లో జీవితపుత్రిక పండగ..నదుల్లో మునిగి 43 మంది మృతి

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో జీవితపుత్రిక పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పవిత్ర స్నానాల పేరుతో నదులు, చెరువుల్లో మునిగి 43 మంది మృతి చెందారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. మృతుల్లో 37 మంది చిన్నారులు ఉన్నారు. ఈ సంఘటనలు బుధవారం 15 జిల్లాల్లో జరిగాయి. ఇప్పటివరకు మొత్తం 43 మృతదేహాలను వెలికి తీయగలిగామని, ఇంకా గాలింపు జరుగుతోందని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగం వెల్లడించింది.

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. అప్పుడే ఎనిమిది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ జరిగింది. తూర్పు, పశ్చిమ చంపారన్, నలందా, ఔరంగాబాద్, కైమూరు, బక్సర్, సివాన్, రోహతాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్ గంజ్, అర్వాల్ జిల్లాల్లో ఈ సంఘటనలు జరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News