- Advertisement -
రోమ్: దక్షిణ ఇటలీ సమీపంలోని ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ బోటు ప్రమాదంలో 43మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు. వలసదారులతో కిక్కిరిసిపోయిన చెక్క బోటు దిబ్బలను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని ఇటాలియన్ కోస్టు గార్డు తెలిపారు. 80మందిని ప్రమాదం నుంచి రక్షించినట్లు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన తర్వాత కొంతమంది ఒడ్డుకు చేరుకునిప్రాణాలతో బయటపడ్డారు. తీరం వెంబడి 43మృతదేహాలను కనుగొన్నట్లు కోస్టు గార్డుప్రకటనలో తెలిపింది. 20మీటర్లు (66 అడుగులు) ఉన్న బోటులో వలసదారులు సామర్థానికి మించి ప్రయాణించారని ఇటాలియన్ ప్రీమియర్ జార్జియా మెలోనీ తెలిపారు.
- Advertisement -