Saturday, November 23, 2024

ఇండోనేసియాలో కుంభవృష్టి: వరదలకు 44 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జకర్తా : ఇండోనేసియా తూర్పు ప్రాంతంలో ఎడతెరిపిలేని వర్షాలకు వరదలు ముంచుకొచ్చి కొండచరియలు విరిగి పడడంతో 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గల్లంతయ్యారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో భారీ వరదలతో ముగ్గుర కొట్టుకు పోయి శవాలుగా తేలారు. 40 ఇళ్లు దెబ్బతిన్నాయి. వాల్‌బర్క్ అనే మరోగ్రామంలో ముగ్గురు చనిపోగా, ఏడుగురు గల్లంతయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది ఫ్లోర్స్ ద్వీపం లోని తూర్పు నుసా టెంఘరా ప్రావిన్స్‌కు చెందిన వారు. పొరుగునున్న బీమా పట్టణంలో పదివేల మంది జటి ప్రాంతానికి తరలి పోయారు. విద్యుత్ సరఫరా లేకపోవడం, రోడ్లు దిగ్బంధం, మారుమూల ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకోవడంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది. కొండ ప్రాంతంలో ఉన్న లామినేలే అనే గ్రామంలో అర్థరాత్రి ఒక్కసారి ఇళ్లపైకి కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లన్నీ బురదమయ మయ్యాయి. ఇక్కడ 38మంది మృతి చెందారు.

44 died after Heavy Rains in Indonesia

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News