Wednesday, January 22, 2025

గజ్వేల్ బరిలో 44 మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గజ్వేల్ నుంచి ఎన్నికల బరిలో 44 మంది అభ్యర్థులు ఉన్నారని రిటర్నింగ్ అధికారి బుధవారం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. గడువు ముగిసిన అనంతరం బరిలో ఎంతమంది ఉన్నారో రిటర్నింగ్ అధికారి తెలిపారు. సిఎం కెసిఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్ నుంచి బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్, కామారెడ్డి నుంచి పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల స్క్రూటినీ తర్వాత 114 మంది బరిలో ఉండగా, బుధవారం 70 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో గజ్వేల్‌లో 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇక్కడ బిఆర్‌ఎస్‌నుంచి కెసిఆర్, బిజెపినుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి తూముకుంట నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 39 మంది బరిలో నిలిచారు. స్క్రూటినీ తర్వాత 58 మంది పోటీలో ఉండగా, ఆ తర్వాత 19 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 39 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. కామారెడ్డిలో బిఆర్‌ఎస్ నుంచి కెసిఆర్, కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, బిజెపి నుంచి వెంకటరమణారెడ్డి పోటీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News