Thursday, January 23, 2025

ఆ కాలనీలలో ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణ..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న పేద, అల్పాదాయ వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని 44 కాలనీల్లో ప్రభుత్వ స్థలాల క్రమబద్దీకరణకు జిఒ 118 జారీ చేసింది. దీని ప్రకారం రెవెన్యూ శాఖ సిసిఎల్ ఎ దరఖాస్తుల స్వీకరించనున్నది. దశాబ్దాల కాలంగా ప్రభుత్వ స్థలాలలో నివాసం ఉంటున్న పేదలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

గజానికి రూ.250 చొప్పన స్థలాలను వెయ్యి గజాల లోపు స్థలాలను క్రమబద్దీకరించనున్నారు. స్థలాల క్రమబద్దీకరణకు చెల్లించే మొత్తాన్ని ఆరు నెలల వ్యవధిలో నాలుగు దఫాలుగా చెల్లించాలని సూచించింది. మీ సేవలో దరఖాస్తుదారులు.. తమ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులు, ఆస్తిపన్ను, జలమండలి బిల్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ తమ పత్రాలతో జత చేయాలని సూచించింది. దరఖాస్తు నమోదు కోసం రూ. 500 చెల్లించాలని కోరింది. దరఖాస్తును ఈ నెల 20వ తేదీలోగా అందజేయాలని సూచించింది.

ప్రభుత్వ స్థలాలు క్రమబద్దీకరించే 44 కాలనీలు ఇవే..

* ఎల్ బినగర్ నియోజకవర్గ పరిధిలోని.. సరూర్‌నగర్ మండలం కర్మన్‌ఘాట్ డివిజన్‌లోని మాధవనగర్ కాలనీ, శ్రీనిధి కాలనీ, జనార్దన్‌రెడ్డి నగర్ కాలనీ, మల్లికార్జునహిల్స్, అవంతికాలనీ(అవెన్యూ హోమ్స్), చంపాపేట్ డివిజన్‌లోని మారుతీనగర్‌కాలనీ, తూర్పు మారుతీనగర్ నివాసితుల అసోసియేషన్, మల్లారెడ్డి/రాజిరెడ్డి కాలనీ, రాజిరెడ్డి నగర్ కాలనీ, ఎస్‌వి కాలనీ, వినాయకనగర్ కాలనీ, మన్సూరాబాద్ డివిజన్‌లోని బాలాజీనగర్, శ్రీరామహిల్స్ కాలనీ, వివేకానందనగర్ కాలనీ, రాగాల ఎన్‌క్లెవ్, పద్మావతినగర్, కమల్ నగర్, సిఆర్ ఎన్‌క్లెవ్, బ్యాంక్ కాలనీ, కాస్మోపాలిటన్ కాలనీ, హయత్‌నగర్ సాహెబ్ నగర్ కలాన్ ప్రాంతంలోని సామనగర్‌కాలనీ, సిబిఐ కాలనీ, విజయనగర్ కాలనీ,సాగర్ కాంప్లెక్స్, శ్రీపురం కాలనీ, వైదేహి నగర్, బిఎన్ రెడ్డి నగర్, శ్రీరామ్‌నగర్‌కాలనీ, ఎస్‌కెడి నగర్. మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్, నాగోల్ ప్రాంతంలోని సాయినగర్ కాలనీ, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ, జైపూర్ కాలనీ, అరుణోదయనగర్ కాలనీ, గణేష్‌నగర్ కాలనీ, లలితనగర్ నార్త్ కాలనీ, ఈశ్వరీపురి కాలనీ. మేడిపల్లి మండలంలోని సాలార్జంగ్ కంచె పర్వతానగర్ ప్రాంతంలోని సాయిప్రియానగర్, సత్యనారాయణపురం కాలనీ.

* రంగారెడ్డి జిల్లా పరిధిలోని రాజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలోని సిక్కు చావానీ.

* హైదరాబాద్ జిల్లా పరిధిలోని కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలోని పాత మిలిటరీ ప్రాంతాలు బంజారాదర్వాజ (గోల్కొండ), బండలైన్ (నాంపల్లి), మహమ్మదీ లైన్స్ (షేక్‌పేట్) మాసబ్ లైన్స్,(ఆసిఫ్‌నగర్) , ఎసి గార్డు (ఆసిఫ్‌నగర్).

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News