Monday, December 23, 2024

మరోసారి కరోనా కలవరం.. 4 వేలు దాటిన కొత్త కేసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మూడేళ్లు గడిచినా దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఇంకా తగ్గలేదు. ఇటీవల మరోసారి కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల వ్యవధిలో నాలుగు వేల మందికి పైగా కరోనా బారిన పడ్డారని బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం 1,31,086 కరోనా నిర్ధారణ పరీక్షలు జరగ్గా 4,435 కేసులు వచ్చాయి. దాంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతానికి చేరింది.

క్రియాశీల కేసులు 23,091(0.05శాతం) కి ఎగబాకాయి. రికవరీ రేటు 98.76శాతంగా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,30,916 గా ఉంది. ఇప్పటివరకు 220.6 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, వంటి రాష్ట్రాల్లో క్రియాశీల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళవారంతో పోలిస్తే బుధవారం కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.

వర్చువల్ విచారణ చేపట్టండి… సిజేఐ డీవై చంద్రచూడ్
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవాదులు స్వేచ్ఛగా వర్చువల్ రీతిలో కోర్టుకు హాజరు కావచ్చని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కీలక ప్రకటన చేశారు. కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, ఒకవేళ న్యాయవాదులు వర్చువల్ పద్ధతిలో కోర్టుకు హాజరు కావాలనుకుంటే ఆన్‌లైన్ విచారణ చేపట్టవచ్చని పేర్కొన్నారు. హైబ్రిడ్ పద్ధతిలో అంటే వీలైతే కోర్టు లేదంటే వర్చువల్‌గా కూడా విచారణలో పాల్గొనవచ్చని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News