Wednesday, January 22, 2025

సంక్రాంతి స్పెషల్

- Advertisement -
- Advertisement -

4,484 ప్రత్యేక బస్సులు

నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతాం :  టిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ తెలిపారు. నేటి నుంచి (జనవరి 6 నుంచి 15వ తేదీ వరకు) హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడపాలని నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్, అరంఘాడ్, కెపిహెచ్‌బి తదితర ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. బస్‌భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని ఆయన తెలిపారు. ప్రజలు త్వరగా గమ్యస్థానాలకు చేరుకునేలా టోల్‌ఫ్లాజాల వద్ద టిఎస్ ఆర్టీసి బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని, పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.

అధికారులతో ఎండి సమీక్ష
ఈ క్రమంలోనే ప్రత్యేక బస్సులకు సంబంధించి ఆర్టీసి అధికారులతో ఎండి సజ్జనార్ శుక్రవారం బస్ భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆర్‌ఎంలు, డిఎంలు, జిల్లా అధికారులు, ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఎపి, కర్ణాటక, మహారాష్ట్ర ఇంటర్ స్టేట్ సర్వీస్‌లపై అధికారులు ఫోకస్ చేయాలని ఎండి సూచించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News