మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు అధికార యం త్రాంగం సమయాత్తమవుతోంది. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి ఆస్కారం లేకుండా చ ర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర అధికార యంత్రాం గం విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఆ సోదాల్లో పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం, మద్యం పట్టుబడుతోంది. అక్రమ నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు లేదా ఇతర ప్ర లోభాలపై కఠిన చర్యలు తప్పవని చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల పై పర్యవేక్షణ, హవాలా ఆపరేటర్లపై నిఘా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడే తనిఖీలు, సోదాల్లో భారీగా సొత్తు లభిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో తనిఖీల్లో రూ.5.1 కోట్ల నగదు, రూ.42 కోట్లు విలువైన బంగారం ను అధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి బంగారం వ్యాపారి నుంచి కూకట్‌పల్లిలోని రూ.2 కోట్లు విలువైన బంగారం, వజ్రాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూకట్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఆ వ్యాపారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట చిలుకూరులో తనిఖీల్లో
రూ.45 లక్షలు పట్టివేత
సూర్యాపేట చిలుకూరులో తనిఖీల్లో రూ.45లక్షలు స్వాధీనం చేసుకోగా, తమ్మర వద్ద నిర్వహించిన తనిఖీల్లో కారు డ్రైవర్ నుంచి రూ.7.30 లక్షలను పోలీసులు జప్తు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ వద్ద తనిఖీల్లో రసీదులు లేకుండా తీసుకెళ్తున్న రూ.30 లక్షల విలువైన 50 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి పటాన్‌చెరులో వాహన తనిఖీల్లో రూ.7 లక్షలు చిక్కాయి. సరైన పత్రాలు చూపి నగదు, బంగారంతో పాటు ఇతరత్రా వస్తువులు తీసుకెళ్తే ఏ ఇబ్బంది లేదని పోలీసులు స్పష్టం చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో తనిఖీలు చేసిన పోలీసులకు రూ.2.40 లక్షల నగదు లభ్యమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ.4 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపకపొవడంతో నగదును పోలీసులు సీజ్ చేశారు.