- Advertisement -
సోఫియా: బల్గేరియాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 45 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన బల్డేరియా రాజధాని సోషియా నుంచి 40 కిలో మీటర్ల దూరంలో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని అగ్నిమాపక అధికారి నికోలాయ్ నికోలోవ్ తెలిపాడు. బస్సు టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి ఉత్తర మసిడోనియాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బల్గేరియా ప్రధాని జోరాన్ జువ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. క్షతగాత్రులు పూర్తి స్థాయిలో వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
- Advertisement -