Sunday, January 19, 2025

ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో తలపడుతున్న ఆప్, బిజెపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసిడి)కు చెందిన 250 వార్డులకు ఎన్నికలు ఆదివారం ఉదయం 8.00 గంటల నుంచి మొదలయింది. ఓటింగ్ సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగనున్నది. దాదాపు 13665 పోలింగ్ స్టేషన్లకు దాదాపు లక్ష మంది సిబ్బందిని మోహరించారు. 250 స్థానాలకు 1349 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), బిజెపి, కాంగ్రెస్ మధ్యే కొనసాగుతోంది. ఎంసిడి ఎన్నికలకు ఢిల్లీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ విస్తృత ఏర్పాట్లను చేసింది. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 7న జరుగనున్నది. ఫలితాలు కూడా అదే రోజున ప్రకటిస్తారు. నేడు 4.00 గంటల వరకు 45 శాతం మంది ఓటేశారని తెలిసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ఓటును వినియోగించుకున్నారు. ప్రజలకు కష్టాలు కలిగించే పార్టీ కన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీకి ఓటేయమని ఆయన ఈ సందర్భంగా ఓటర్లకు విన్నవించుకున్నారు. “నిజాయితీకి, పనితనం ప్రదర్శిన పార్టీకి ప్రజలు ఓటేయాలి. నగరంలో పరిశుద్ధత మీద దృష్టి పెట్టిన వారిని గెలిపించండి. అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మాత్రం ఓటేయకండి” అని ఆయన విలేకరుల సమక్షంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది మొదలులో పునరైక్యం(రీయూనిఫైడ్) అయ్యాక జరుగుతున్న తొలి ఎన్నికలు ఇవి. ఇదివరలో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ – దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(ఎస్‌డిఎంసి), ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(నార్త్ ఎంసిడి), తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఈడిఎంసి)గా విభజించబడి ఉండేది. ఢిల్లీ పౌర సంస్థల అధికారం కలిగి ఉన్న బిజెపితో ఆప్ పార్టీ తీవ్రంగా తలపడుతోంది. ఇప్పటి వరకు బిజెపి 15 ఏళ్లుగా ఎంసిడిని పాలిస్తోంది. ఇప్పుడు నాలుగోసారి అధికారం హస్తగతం చేసుకోవాలని ఉవ్విళూరుతోంది. “ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశాము, సురక్షితంగా ఓటేయడానికి తగిన వాతావరణం ఏర్పాటుచేశాం” అని ఢిల్లీ ఎన్నికల కమిషనర్ విజయ్ దేవ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News