Tuesday, January 21, 2025

దేశంలో కొత్తగా 4518 కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

Rising corona positivity rate in Delhi

 

ఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ ఆందోళనకు గురి చేస్తోంది. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో మళ్లీ భయం ఏర్పడింది. గతం 24 గంటల్లో 4518 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది మంది చనిపోయారు. కరోనా వైరస్ నుంచి 4.26 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 25 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా భారిన పడ్డ వారి సంఖ్య 4.31 కోట్లకు చేరోకగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారు. ఆదివారం సెలవు దినం కావడంతో 2.57 లక్షల మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు 194 కోట్లకు పైగా కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News