Tuesday, January 21, 2025

4520 డబుల్ ఇండ్ల నిర్మాణం జగిత్యాల జిల్లాకే తలమానికం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేద ల కోసం తెలంగాణ ప్రభుత్వం 4520 డబుల్ ఇం డ్లు నిర్మించడం జగిత్యాల జిల్లాకే తలమానికమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నా రు. ఆదివారం నూకపెల్లి డబుల్ ఇండ్లకు నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం రూ.14 కోట్లు మంజూ రు చేయగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌తో కలిసి మంత్రి ఈశ్వర్ పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ,నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడం జరిగిందని, దాదాపు పనులు పూర్తి అ యినట్లు మంత్రి తెలిపారు. డబుల్ ఇండ్లు నిర్మించి న ప్రాంతానికి కెసిఆర్ నగర్‌గా నామకరణం చేయ డం సంతోషదాయకమన్నారు. 4520 డబుల్ ఇండ్ల మంజూరుకు, నిర్మాణానికి సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్, ఎంఎల్‌సి కవిత, ఎమ్మెల్యే సంజయ్‌కుమా ర్ చొరవ చూపడం వల్లే జగిత్యాల లాంటి పట్టణానికి ఇంత పెద్ద ఎత్తున ఇండ్లు మంజూరయ్యాయని అన్నారు.ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, కావాల్సిన మౌళిక వసతులు రహదారులు, విద్యుత్, నీటి సౌకర్యం తదితర పనులను త్వరితగతిన పూర్తి చే యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎంత త్వరగా పనులు పూర్తి చేస్తే అంత తొందరగా లబ్దిదారులకు ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. ఎ మ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ హాయాంలో 4014 మందికి ఇండ్లు కేటాయిస్తే కేవలం 40 మంది మాత్రమే ఇండ్లు నిర్మించుకున్నారని అన్నారు. సూకపెల్లిలో సరైన మౌళిక వసతులు కల్పించకుండా ఇండ్లు నిర్మించుకోవాలని ప ట్టాలు ఇచ్చారని, అక్కడ నీటి వసతి లేక చాల వరకు ఇండ్లు నిర్మించుకునేందుకు విముఖత చూపినట్లు తె లిపారు. ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇప్పటికే 3520 మంది లబ్దిదారులను ఎంపిక చేశామని, మిగిలిన 1000 మందిని కూడా త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకం గా ఇండ్లు మంజూరు చేస్తామని, ఎవరూ కూడా ఆందోళన చెందవద్దన్నారు. సిఎం కెసిఆర్, ఎంఎల్ సి కవిత, మంత్రులు కెటిఆర్, ప్రశాంత్‌రెడ్డి, దయాకర్‌రావు, హరీష్‌రావు, ఈశ్వర్‌ల సహకారంతో ఇం డ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యాయని, అన్ని మౌళిక వసతులు కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, దివాకర, ఆర్‌డిఓ నర్సింహమూర్తి, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చై ర్మన్ గోలి శ్రీనివాస్, ఎస్‌ఇ రవీందర్, ఇఇలు శేఖర్‌రెడ్డి, రహమాన్, డిఇలు జలెంధర్‌రెడ్డి, మిలింద్, రా జేశ్వర్, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

సమైఖ్యతను చాటేందుకే జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణలు
సమైఖ్యతను చాటే విధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సం క్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైఖ్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయంలో మంత్రి ఈశ్వర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్దితో పా టు దేశాభివృద్దిని కాంక్షిస్తున్నామన్నారు. ప్రజలం తా సౌకర్యాలతో, సగౌరవంగా జీవించినప్పుడే ప్ర జలందరి గొప్పతనం దేశానికి విదితమవుతుందన్నా రు. తెలంగాణ ప్రభుత్వం సమైఖ్యత దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోందని, తెలంగాణ ప్రత్యేక సంఘటనల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహి ంచుకోవడం జరుగుతోందన్నారు.

అనంతరం విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేశారు. స్వచ్చత హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా మంత్రి గోడప్రతిని ఆవిష్కరించా రు. స్వచ్చ సర్వేక్షన్ 2023లో రాష్ట్ర స్థాయిలో ఉత్త మ గ్రామ పంచాయతీలుగా ఎంపికైన ఆయా గ్రా మాల సర్పంచ్‌లను మంత్రి శాలువాలతో సత్కరించారు. అనంతరం కాలుష్య నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమల ను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ మ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్‌పి చైర్‌పర్సన్ దావ వసంత, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా ఎస్‌పి భాస్కర్, అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, దివాకర, డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు,పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News