Sunday, December 22, 2024

జిఎస్‌టి స్కామ్‌లో ఇడి కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో వెలుగు చూసిన జిఎస్‌టి స్కాంలో ఇడి కేసు నమోదు చేసింది. జిఎస్‌టి చెల్లింపుల్లో రూ.46 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఇడి గుర్తించింది. ఇసిఐఆర్ నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ కేసులో ఎ1గా వాణ్యిజ్య పన్నుల అదనపు కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, ఎ2గా ఉప కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఎ3గా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శోభన్ బాబు, ఎ4గా ప్లియంటో టెక్నాలజీస్, ఎ5గా మాజీ పిఎస్ సోమేశ్ కుమార్‌ను సీసీఎస్ పోలీసులు నమోదు చేశారు. ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టికి సంబంధించి రూ.1400 కోట్ల మేర ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ని క్లెయిమ్ చేసినట్లు, దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లినట్లు సిసిఎస్ పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బోగస్ ఇన్వాయి స్‌లను సృష్టించి, పెద్ద ఎత్తున ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గత ఏడాది చివర్లో నిర్వహించిన ఆడిట్‌లో గుర్తించింది. ఈ కేసులో వస్తువులు సరఫరా చేయకపోయినా బోగస్ ఇన్వాయిస్‌లను సృష్టించారని అధికారులు గుర్తించారు.

ఇది వందల కోట్ల వ్యవహారం కాదని, మొత్తం స్కామ్ రూ.వేల కోట్లలో ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చి సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి అప్పగించింది. సోమేశ్‌కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసేందుకు అంగీకరించామని నిందితులుగా ఉన్న కాశీవిశ్వేశ్వర రావు, శివరామప్రసాద్ అంగీకరించినట్లు సిసిఎస్ పోలీసులు గతంలో వెల్లడించారు. ఈ ఇద్దరు అధికారులతో పాటు సోమేశ్‌కుమార్ ‘స్పెషల్ ఇనిషియేటివ్స్’ పేరిట ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని ఒకరికొకరు చేరవేసుకునేవారని సిసిఎస్ పోలీసులు దర్యా ప్తులో తేల్చారు. సోమేష్ సహకారంతో 75 సంస్థలకు సంబంధించిన ఐటి రిటర్నుల సమాచారం తెలియకుండా చేసేందుకు సాఫ్ట్‌వేర్‌ను మార్చా రు. తద్వారా ఐటిసి క్లెయిమ్‌లకు వీలు కల్పించి రూ.1400 కోట్ల వరకు ఐటిసి సొమ్మును అడ్డదారుల్లో క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఒక్క తెలంగాణ బేవరెజెస్ కార్పొరేషన్‌కు సంబంధించినదే రూ.1000 కోట్ల వరకు ఐటిసిని క్లెయిమ్ చేసినట్లు గుర్తించారు. మరో 11 సంస్థలకు సంబంధించి రూ.400 కోట్ల ఐటిసి సొమ్మును క్లెయిమ్ చేసినట్లు తేలినట్లుగా తెలుస్తోంది. కుంభకోణం మొత్తం సోమేశ్‌కుమార్ కను సన్నల్లోనే నడిచినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. సోమేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు అధికారులకు సిఐడి అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఇడి కూడా కేసు నమోదు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News