Sunday, January 19, 2025

ఛత్తీస్‌గఢ్ మొదటి దశ ఎన్నికల్లో 46 మంది అభ్యర్థులు కోటీశ్వర్లు

- Advertisement -
- Advertisement -

రాయ్‌పూర్ : నవంబర్ 7న జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల్లో పోటీకి నిలబడిన 223 మంది అభ్యర్థుల్లో దాదాపు 46 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఖడ్గరాజ్‌సింగ్‌కు రూ. 40 కోట్లకు మించి విలువైన ఆస్తిపాస్తులు ఉన్నట్టు వెల్లడైంది. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్ (ఎడిఆర్) అనే ఛత్తీస్‌గఢ్ ఎలెక్షన్ వాచ్ తన నివేదికలో అభ్యర్థుల ఆస్తిపాస్తులు, ఆదాయాల వివరాలు వెల్లడించింది. మొదటి దశ ఎన్నికల్లో పోటీకి నిలబడిన అభ్యర్థుల సరాసరి ఆస్తుల విలువ రూ.1.34 కోట్లుగా అంచనా కట్టింది. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 20 మంది బిజేపీ అభ్యర్థుల ఆస్తులు రూ.5.33 కోట్లు , 20 మంది కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తులు రూ.5.27 కోట్లు, 10 మంది ఆప్ అభ్యర్థుల ఆస్తులు రూ.4.45 కోట్లు,

15 జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జె) అభ్యర్థుల ఆస్తుల సరాసరి విలువ రూ. 30.54 లక్షలుగా విశ్లేషించడమైంది. మొత్తం 90 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొదటి దశలో 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా 70 నియోజకవర్గాలకు నవంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. తక్కువ విలువైన ఆస్తులున్న అభ్యర్థుల్లో ముగ్గురు తేలారు. డొంగార్‌గఢ్ (ఎస్‌సి) స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న హేమ్ కుమార్ సత్నామీ ఆస్తుల సరాసరి విలువ కేవలం రూ.8000 కాగా, అంతగఢ్ ( ఎస్‌టి ) నుంచి పోటీకి దిగిన భారతీయ శక్తి చేతన పార్టీ అభ్యర్థి నర్‌హర్ డేవ్ గాడే ఆస్తుల సరాసరి విలువ రూ.10,000 , రాజనందగావ్ నుంచి పోటీ చేస్తున్న రిపబ్లికన్ పక్షాకు చెందిన అభ్యర్థి ప్రతిమా వాస్నిక్ ఆస్తుల విలువ రూ. 10,000 గా తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News