Saturday, November 9, 2024

‘కోనసీమ’ కేసులో 46మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస ఘటనలో 46 మందిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. ఈక్రమంలో అమలాపురంలో పోలీస్ వాహనాలపై రాళ్లు రువ్విన కేసులో సామర్లకోటకు చెందిన కానిస్టేబుల్ ్డ వాసంశెట్టి సుబ్రహ్మణ్యం ఫిర్యాదు మేరకు నిందితులపై 307,143,144,147,148,151,152, 332, 336,427,188, 353 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ అల్లర్ల కేసులో దాడులకు పాల్పడిన వడగాన నాగబాబు, నూకల పండు, కురసాల నాయుడు, దున్నాల దిలీప్, అడపా శివ, చిక్కాల మధుబాబు, దువ్వా నరేష్, లింగోలు సతీష్, నల్ల నాయుడు, నక్కా హరి, కిశోర్, అడపా సత్తిబాబు, నల్ల రాంబాబు, యాళ్ల రాధ, గాలిదేవర నరసింహమూర్తి, సంసాని రమేష్, కడాలి విజయ్, తోట గణేష్, అన్యం సాయి, దూలం సునీల్, కల్వకొలను సతీష్, కానిపూడి రమేష్, ఈదరపల్లి జంబు, చింతపల్లి చిన్నా, పోలిశెట్టి కిషోర్, నల్లా కరుణ, పాటి శ్రీను, చిక్కం బాలాజీ, పెద్దిరెడ్డి రాజా, మద్దిశెట్టి ప్రసాద్, వినయ్, శివ, సాధనాల మురళీ, నల్లా అజయ్, వాకపల్లి మణికంఠ, కాసిన ఫణీంద్ర, కొండేటి ఈశ్వర్రావు, అరిగెల తేజ, అరిగెల వెంకటరామారావు, రాయుడు స్వామిలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మరి కొందరి కేసులు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. అదేవిధంగా ఎర్ర వంతెన వద్ద బస్సును దగ్ధం చేసిన కేసులో ఆర్‌టిసి డ్రైవర్ గిరిబాబు ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News