Friday, December 20, 2024

బరిలో 47మంది అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

మొత్తం నామినేషన్లు వేసినవారు 130మంది
47మంది నామినేషన్ల తిరస్కరణ
నామినేషన్లు ఉపసంహరించుకున్న 36మంది
టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్యే ప్రధాన పోటీ

మన హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల కు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఈ ఉప ఎ న్నికకు మొత్తం 130 మంది అ భ్యర్థులు 190 సెట్ల నామినేషన్లు దాఖలు చేశా రు. ఇందులో 47మంది నా మినేష న్లు ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మిగిలిన 83 మందిలో 36మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తంగా ఉప ఎన్నిక బరిలో 47 మంది ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో మునుగోడు ఉప ఎన్నిక బరిలో నిలిచిన 13మంది తమ నామినేషన్లను 10 మం ది, సోమవారం ముగ్గురు నామినేషన్లను ఉపసంహరించుకుని టిఆర్‌ఎస్ అభ్య ర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మద్దతు ప్రకటించా రు. మునుగోడు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బిజెపి తరఫున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వా యి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News